Homeటాప్ స్టోరీస్Modi fuel security call : మోడీ దేశ ప్రజలకిచ్చిన సలహాల్లో తప్పేముంది?

Modi fuel security call : మోడీ దేశ ప్రజలకిచ్చిన సలహాల్లో తప్పేముంది?

Modi fuel security call : మోడీ నిన్న హైదరాబాద్ సభలో మాట్లాడుతూ దేశ ప్రజలకు ఓ సంచలన పిలుపునిచ్చాడు. ఇంధన భద్రత పాటించండి.. విదేశీ మారకద్రవ్యం కరిగిపోతోంది.. రూపాయి విలువ పడిపోతోంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి.. బంగారం కొనుగోలును సంవత్సరం తగ్గించండి.. విదేశాల్లో పెండ్లీలు, పేరంటాలు ఫంక్షన్లను రద్దు చేసుకొని ఇండియాలోనే చేసుకోండి.. ఎలక్రిక్ వాహనాలు వాడండి.. మెట్రో లాంటి సర్వీసులను ఉపయోగించుకోండి..దేశ వస్తువులను కొనండి.. ఇక్కడే అన్నింటిని చేసుకోండి అంటూ మోడీ పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా.. మన దేశంలో మోడీ సర్కార్ పెంచలేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు గుర్తించవు. మోడీ ఎంత చేసినా విమర్శలు చేస్తూనే ఉంటుంది..

కేంద్రం ఎంత ప్రయత్నించినా దేశ ప్రజలుగా మనకు మనం మన దేశం కోసం కొన్ని పాటించాలి. మోడీతోపాటు ప్రజలంతా కలిస్తేనే దేశం ముందుకు వెళుతుంది. భారత్ దాదాపు 80 శాతం ఇంధన దిగుమతిపైనే ఆధారపడింది. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఫారిన్ ఎక్స్చేంజీల మధ్య ఒత్తిడి పెరుగుతోంది.

బంగారం విషయంలోనూ ప్రజలు విపరీతంగా కొనేస్తున్నారు. దానివల్ల మన సంపద , పెట్టుబడి కింద కొంటూ దేశ ప్రజల సంపదను విదేశాలకు తరలిపోతోంది. సాధ్యమైనంత వరకూ ఆ భారం పడకుండా ప్రభుత్వం ధరలు పెంచకుండా భరిస్తోంది. అందుకే మోడీ దేశ ప్రజలకు ఈ పిలుపునిచ్చారు.

మోడీ దేశ ప్రజలకిచ్చిన సలహాల్లో తప్పేముంది ? దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

మోడీ దేశ  ప్రజలకిచ్చిన సలహాల్లో తప్పేముంది ?  #modi  #RamTalk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version