Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Fans: జగన్ పై అభిమానుల తిరుగుబాటు!

YS Jagan Fans: జగన్ పై అభిమానుల తిరుగుబాటు!

YS Jagan Fans: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో అధినేత జగన్ అంటే వల్లమాలిన అభిమానం. ప్రత్యేక పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే విపరీతమైన అభిమానులు ఆ పార్టీకి సొంతం. వారికి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఇట్టే నచ్చేస్తూ వచ్చింది. కానీ మొన్నటి ఓటమితో అభిమానుల్లో సైతం ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం సైతం వారికి నచ్చడం లేదు. అందుకే ఆయనతో విభేదిస్తున్నారు. కొందరు సైలెంట్ అయ్యారు. మరికొందరు అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ పార్టీతో పాటు అధినేతపై అభిమానం పెంచుకున్న వారు మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఎవరికీ నచ్చడం లేదు. అందుకే సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అవుతున్నారు. తాజాగా ఓ కార్యకర్త అయితే.. జగన్మోహన్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* అప్పట్లో సైనికుల్లా..
2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారు. సొంత కుటుంబాలను వదిలి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలన్న కసితో పని చేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం సరిగా లేదు. వలంటీర్లకు బాధ్యతలు కట్టబెట్టి తన విజయం కోసం పని చేసిన వారిని పక్కన పెట్టేశారు. అస్పష్ట విధానాలతో ముందుకు సాగడంతో ఏపీ ప్రజలు జగన్ పాలనకు విసిగి వేసారి పోయారు. అందుకే 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. ఇప్పటికీ జగన్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు మారకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అధికారంలోకి వస్తామన్న ధీమా సన్నగిల్లుతోంది.

* జగన్ అస్పష్ట విధానాలతో..
జాతీయ పార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండ్ లేదు. ఏ కూటమిలతో సంబంధం లేదు. ఏపీలో మిగతా రాజకీయ పార్టీలతో చెలిమి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం లేదు.. అనుకున్న కార్యక్రమాలు ఏవి పార్టీలో జరగడం లేదు. ఇవన్నీ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళాన్ని రేపుతున్నాయి. అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని పార్టీలో కొనసాగి.. ఆయన నాయకత్వాన్ని అడ్డగోలుగా సమర్థించిన వారు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఓ అభిమాని అధికారికంగానే చేసిన వీడియో సగటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని బాధను తెలియజేస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version