Homeఎంటర్టైన్మెంట్Trisha Krishnan New Movie: హీరోయిన్ త్రిష కి మరో బంపర్ ఆఫర్.. అదృష్టం అంటే...

Trisha Krishnan New Movie: హీరోయిన్ త్రిష కి మరో బంపర్ ఆఫర్.. అదృష్టం అంటే ఇదే భయ్యా..

Trisha Krishnan New Movie: హీరోయిన్ త్రిష కి ప్రస్తుతం జాతకం మామూలు రేంజ్ లో నడవడం లేదు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమెకు త్వరలోనే భర్త కాబోతున్నాడు, మరోపక్క సినీ కెరీర్ కూడా దూసుకుపోతుంది. సాధారణంగా 40 ఏళ్ళ వయస్సులోకి అడుగుపెట్టిన ఏ హీరోయిన్ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు సంపాదించుకోలేరు. కానీ త్రిష మాత్రం వరుసగా క్రేజీ పాన్ ఇండియన్ సినిమాల్లో హీరోయిన్స్ రోల్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. అందం తో పాటు, అద్భుతంగా నటించగలదు కాబట్టే , ఆమెకు ఈ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి, పైగా సీఎం కి అత్యంత సన్నిహితం కాబట్టి , ఆమె కెరీర్ కి మరో పదేళ్ల పాటు ఎలాంటి డోకా లేదు. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘కరప్పు’ చిత్రం మే 14 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

సూర్య హీరో గా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సంగతి కాసేపు పక్కన పెడితే హీరోయిన్ త్రిష ఖాతాలో మరో బంపర్ ఆఫర్ వచ్చి చేరింది. త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో మల్టీస్టార్రర్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతుండగా, అనిరుద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వీడియో కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో ఒక హీరోయిన్ పాత్ర కోసం త్రిష ని ఎంచుకున్నారట, రీసెంట్ గానే ఆమె అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేసిందని టాక్. మరో హీరోయిన్ పాత్ర కోసం ఎవరిని తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఏడాది లోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతుందట.

ఒకపక్క తనకు బాగా కావాల్సిన వాళ్ళు రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉన్నారు, త్వరలో ఆమె కూడా ఒక బలమైన బాధ్యతలను చేప్పట్టబోతోంది , మరోపక్క సినీ కెరీర్ పరంగా కూడా పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తోంది. నటిగా, మనిషిగా ఇంతకు మించిన ఆనందం, సక్సెస్ ఏమి ఉంటుంది చెప్పండి?, రాబోయే రోజుల్లో త్రిష మేనియా ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి. ఇకపోతే తెలుగు లో త్రిష విశ్వంభర చిత్రం చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఈ ఏడాది జులై నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version