Homeజాతీయ వార్తలుMuslim voters shift to Aimim : ముస్లింల ప్రత్యేక పార్టీ.. ఎంఐఎంకు మారిపోతున్నారా?

Muslim voters shift to Aimim : ముస్లింల ప్రత్యేక పార్టీ.. ఎంఐఎంకు మారిపోతున్నారా?

Muslim voters shift to Aimim : భారత దేశంలో దాదాపు అన్నీ సెక్యూలర్‌ పార్టీలే. బీజేపీ, శివసేన మాత్రమే హిందుత్వ పార్టీలుగా గుర్తింపు పొందాయి. చిన్న పార్టీలు ఉన్నా బలమైన పార్టీలు మాత్రం బీజేపీ, తర్వాత శివసేన. కాంగ్రెస్, ఎస్పీ, త్రుణమూల్‌ కాంగ్రెస్, ఆప్, సీపీఐ, బీఎస్పీతోపాటు ప్రాంతీయ పార్టీలు లౌకిక పార్టీలుగా చెప్పుకుంటాయి. అయితే ఇప్పుడు ఈ సెక్యులర్‌ పార్టీలకు కొత్త ముప్పు రాబోతోంది. ఎంఐఎం (అఖిల్‌ భారత్‌ మజ్లిస్‌–ఇ–ఇత్తిహాదుల్‌ ముస్లిమీన్‌) సెక్యూలర్‌ పార్టీలకు భవిష్యత్‌లో చెక్‌ పెట్టబోతోంది. ఇప్పటికిప్పుడు అధికారం సాధించకపోయినా, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది.

ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్‌ గెలుపు..
కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఎంఐఎం మద్దతు కీలకం. కర్ణాటకలో ముస్లిం నాయకులు ఎంఐఎంను పోటీ నుంచి ఉపసంహరించారు. తెలంగాణలో నగరాల్లో అభ్యర్థులు నిలిపి, బీఆర్‌ఎస్‌కు ఓట్లు వదిలేశారు. కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో రెండిటిలో ఎంఐఎం సహాయంతోనే గెలిచింది.

బలపడుతున్న ఎంఐఎం..
బిహార్‌ సిమాంచల్‌లో కాంగ్రెస్‌ 19 నుంచి 6 సీట్లకు పడిపోయింది. ఎంఐఎం 5 సీట్లు సాధించి సమానంగా నిలిచింది. మహారాష్ట్ర మున్సిపల్‌లో 13 మున్సిపాలిటీల్లో 116 సీట్లు. శంభాజీనగర్‌లో 33, విదర్భ, మారేగావ్‌లో 21, నాందేడ్‌లో 14, ధులేలో 10, షోలాపూర్‌లో 8. ముంబైలో ఎన్సీపీ, ఎంఎన్‌ఎస్‌ కంటే ఎక్కువ 8 సీట్లు. సమాజ్‌వాదీ పార్టీ ఒక్క సీటు కూడా లేకుండా పోయింది.

సెక్యులర్‌ పార్టీలకు ముస్లిం ఓటర్ల షాక్‌
ముస్లింలు సెక్యులర్‌ పార్టీలతో ప్రయోజనం లేదని గ్రహించారు. అందుకే ఆర్జేడీ, జేడీయూ ఓట్లు కోల్పోయాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌కు ఓటు వెళ్లాయి. గుజరాత్‌ అహ్మదాబాద్‌ మున్సిపల్‌లో ఎంఐఎం 4 సీట్లు గెలిచింది.

అసోం, బెంగాల్‌ ఎన్నికల్లో పోటీ..
త్వరలో అసోం, బెంగాల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండుచోట్ల పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది. అసోంలో యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌తో చేతులు కలిపేందుకు చర్యలు ప్రారంభించింది. ఇదే జరిగితే ముస్లింలు కాంగ్రెస్‌కు పూర్తిగా దూరమవుతారు. ఇక బెంగాల్‌లో ఇండియన్‌ సెక్యూలర్‌ ప్రంట్‌ అనే పార్టీ ఉంది. ఐఎస్‌ఎఫ్, ఎంఐఎంలు రెండూ చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. దీంతో లౌకికవాదుల ఓట్లు తగ్గిపోకే అవకాశం ఉంది. ఇక ఉత్తర ప్రదేశ్‌లో గతంలో పోటీచేశారు. ఈసారి చిన్న పార్టీలతో కలిసి పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ ఐదారు స్థానాలు గెలిచింది. ఈసారి ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ఎంఐఎం సాధించేలా ఒవైసీ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ముస్లింలు సెక్యులర్‌ పార్టీతలో ఎలాంటి లాభం లేదన్నది అర్థమవుతోంది. ఈ భావన ముస్లింలలో బలపడుతోంది. దీంతో ముస్లింలు ఎంఐఎంవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్‌ కాంగ్రెస్‌ ’సంఘటన్‌ సృజన్‌’ ప్రయత్నాలను వృథా చేస్తుంది.

ముస్లింలు ఎంఐఎంను ఎంచుకుంటే సెక్యులర్‌ పార్టీల ఓటుబ్యాంక్‌ క్షీణిస్తుంది. బీజేపీకి ప్రయోజనం దక్కవచ్చు. ఎంఐఎం గెలుపు రాజకీయ డైనమిక్స్‌ను మార్చే అవకాశం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular