
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63 కోట్లకు పైగా కరోనా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కేంద్రం ఇప్పటి వరకు ఉచితంగా, ప్రత్యేక్షంగా సేకరించి రాష్ట్రాలకు 24 కోట్లకు పైగా మోతాదులు సరఫరా చేసినట్లు పేర్కొంది. ఇందులో వ్యర్థాలతో సహా 22,96,95,199 మోతాదులు వినియోగించినట్లు పేర్కొంది. ఇంకా 1,63,85,701 డోసులు ఇప్పటికీ రాష్ట్రాలు, యూటీల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది.