
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ భేటీలో వివిధ కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, థర్డ్ వేవ్ సన్నద్ధత, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవశాశముంది. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలు, వానాకాలంలో సాగునీరు తదితర అంశాలపై సమీక్షించే వీలుంది.