
దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వైరస్ కట్టడిలో కేంద్రం విఫలమైందంటూ ఆరోపించిన ఆయన తాజాగా గురువారం మరోసారి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహమ్మారి సమయంలో టీకాలు, ఆక్సిజన్, మందులతో పాటు ప్రధాని కూడా కనిపించడం లేదు అంటూ ట్వీట్ చేశారు.