
వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పై కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. గురువారం ఆయన వైఎస్సార్ రైతు భరోసా లో భగంగా అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ గురువారం కంప్యూటర్ లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రెండు కంపెనిలే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయని నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొన్నారు.