
వారసత్వం, కుటుంబ బాంధవ్యాలు లేకుండా భారతదేశమే తన కుటుంబంగా ప్రధాని మోదీ భావిస్తుండటంతోనే ప్రజల నుంచి మంది ఆదరణ లభిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శ్రీవారిపై ఉన్న భక్తి వల్లే తిరుపతి నుంచి జన ఆశ్వీరద యాత్రను ప్రారంభించానని తెలిపారు. అలాగే వేంకటేశ్వరస్వామి అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంతో భక్తి అని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అభివృద్ధి విషయంలో బీజేపీతో వైసీపీ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.