మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చర్చనీయా అంశం అయ్యింది. ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కేసీఆర్ సర్కార్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.