Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసిలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఈ నెల 13 వ తారీఖున పోలీసులు అరెస్ట్ చేసి, బెయిల్ మీద పక్కరోజు విడుదల చేసిన ఘటన నేషనల్ లెవెల్ లో సంచలన టాపిక్ గా నిల్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, మెగా అభిమానులతో పాటు, యావత్తు సినీలోకాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంఘటన ఇది. పొరపాటు రెండు వైపుల నుండి ఉన్నప్పటికీ, కేవలం అల్లు అర్జున్ ని నిందిస్తూ అతన్ని అరెస్ట్ చేయడం సరికాదని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ట్వీట్స్ వేశారు. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కోపం లో సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అయ్యింది. ఎవరైతే ముఖ్యమంత్రిని తిడుతూ పోస్టులు పెట్టారో, వాళ్లందరిపై కేసులు నమోదు చేయించి అరెస్ట్ అయ్యేలా చేయబోతున్నారట పోలీసులు.
దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టారు. అతి త్వరలోనే కేసులు నమోదు చేసి వరుస అరెస్టులు ఉండనున్నాయి. మరోపక్క అల్లు అర్జున్ మధ్యంతర బైలు ని రద్దు చెయ్యాలని హైదరాబాద్ పోలీసులు సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించబోతున్నారు. అంతే కాకుండా సంధ్య థియేటర్ యాజమాన్యం ని సీజ్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. నిన్ననే ఆ థియేటర్ యాజమాన్యం కి పోలీసులు ఉత్తర్వులు జారీ చేస్తూ, అసలు ఎందుకు థియేటర్ ని సీజ్ చేయకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే థియేటర్ ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా హైదరాబాద్ మూవీ లవర్స్ ఎంతగానో ఆదరించిన సంధ్య కంప్లెక్స్ ఇప్పుడు డేంజర్ లో పడింది. ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన థియేటర్ ఇది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ థియేటర్ ని తమ వైకుంఠం లాగా భావిస్తారు.
ఆయన నటించిన ఖుషి చిత్రం కోటి 58 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ థియేటర్ నుండే రాబట్టింది. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఈ రికార్డు ని ముట్టుకోలేకపోయాయి. అదే విధంగా ఆయన హీరో గా నటించిన తొలిప్రేమ చిత్రం ఇదే థియేటర్ లో 217 రోజులకు పైగా ఆడింది. ఇప్పటి వరకు ఈ రికార్డు కూడా సేఫ్. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చే ఏడాది రెండు విడుదల అవ్వబోతున్నాయి. అలాంటి సమయంలో తమకు ఇష్టమైన థియేటర్ మూత పడే అవకాశాలు ఉన్నాయని అనడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరో సమస్య లేదు అన్నట్టుగా, కేవలం అల్లు అర్జున్, ఆయన అభిమానులను టార్గెట్ ఎందుకు చేస్తున్నాడని నెటిజెన్స్ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.