https://oktelugu.com/

Allu Arjun and Revanth Reddy : అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తే కఠిన చర్యలు.. అధికారులకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్!

గత రెండు వారాల నుండి మీడియా లో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన పై ఏ రేంజ్ లో చర్చ నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 01:38 PM IST

    Allu Arjun , Revanth Reddy

    Follow us on

    Allu Arjun and Revanth Reddy : గత రెండు వారాల నుండి మీడియా లో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన పై ఏ రేంజ్ లో చర్చ నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. చిలికి చిలికి గాలి వాన అయ్యినట్టు ఈ ఘటన ఎన్నో మలుపులు తీసుకుంటూ అల్లు అర్జున్ పై తీవ్రమైన నెగటివిటీ ని ఏర్పడేలా చేసాయి. అదే సమయంలో ప్రభుత్వం పై కూడా రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా, మీకు అల్లు అర్జున్ ఒక్కడే కనిపిస్తున్నాడా? అనే విమర్శలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ఇంకా లాగకూడదు అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన TPCC చీఫ్ కి కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ కూడా అల్లు అర్జున్ వ్యవహారం గురించి మాట్లాడరాదని చాలా బలమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు కూడా మీడియా ముందుకు వచ్చి అల్లు అర్జున్ కేసు గురించి, సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడరాదని, మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడట.

    ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క అల్లు అర్జున్ ముద్దాయి గా ఉన్న సమయంలోనే ప్రెస్ మీట్ పెట్టి కేసు గురించి మాట్లాడడం పై తెలంగాణ ప్రభుత్వం తో పాటు, పోలీస్ అధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం పై పోలీసులు అల్లు అర్జున్ ఇంటెర్మ్ బెయిల్ రద్దు చెయ్యాలని కోర్టుని ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా నేడు పోలీసుల ఆదేశాల మేరకు అల్లు అర్జున్ మరోసారి విచారణ నిమిత్తం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ని పోలీస్ స్టేషన్ లో సంధ్య థియేటర్ ఘటనపై విచారిస్తున్నారు. ఇంటి నుండి ఆయన పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

    మరోపక్క అల్లు అర్జున్ ఇంటి పై రాళ్ళ దాడి చేసిన జేఏసీ నాయకులు ఒక్క రోజు కూడా పూర్తి కాకముందే బెయిల్ మీద బయటకి రావడం ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే శ్రీ తేజ్ తండ్రి కూడా తన భార్య రేవతి చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ కాదని, చాలా మంది మేము కేసు వెయ్యడం వల్లే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, నేను నా భార్య చనిపోయిన రెండవ రోజు నుండే అల్లు అర్జున్ కి మద్దతుగా ఉన్నానని, అవసరమైతే కేసు వెనక్కి తీసుకోవడానికి కూడా సిద్ధమేనని ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఇస్తానన్న 25 లక్షల్లో పది లక్షలు ఇచ్చారట. మిగిలిన మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.