Chinmoy Krishna Das : బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ కోర్టు ఈరోజు కట్టుదిట్టమైన భద్రతలో జరిగిన విచారణలో చిన్మోయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారికి బెయిల్ నిరాకరించింది. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు న్యాయవాది అపూర్బా భట్టాచార్య, మరో 10 మంది ఆయన తరపున కోర్టుకు హాజరయ్యారు. మెట్రోపాలిటన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ మోఫిజుర్ హక్ భుయాన్ ప్రకారం, చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎండీ సైఫుల్ ఇస్లాం 30 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ అభ్యర్థనను తిరస్కరించారు.
బంగ్లాదేశ్‌లో దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాది రవీంద్ర ఘోష్, విచారణకు ముందు మంగళవారం సాయంత్రం SSKM హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగంలో చేరారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ..మేము ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఈ వార్త విన్న తర్వాత కోల్‌కతా ఇస్కాన్ వీపీ రాధా రామన్ దాస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. “ఇది చాలా విచారకరమైన వార్త. చిన్మోయ్ ప్రభుకు కొత్త సంవత్సరంలో స్వేచ్ఛ లభిస్తుందని అందరూ ఊహించారు – కానీ 42 రోజుల తర్వాత కూడా, ఈరోజు విచారణలో అతని బెయిల్ రిజక్ట్ అయిందని అన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం అతనికి న్యాయం జరిగేలా చూడాలని.. ఆయన ఆరోగ్యం బాగోలేదని విన్నామని తెలిపారు.
అయితే బంగ్లాదేశ్ సమ్మిలిటో సనాతనీ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహ ఆరోపణలపై నవంబర్ 25న బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. మరుసటి రోజు అతన్ని కోర్టులో హాజరుపరచగా, జైలు కస్టడీకి పంపింది. ఆయన అరెస్ట్ తర్వాత భారత్, బంగ్లాదేశ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి.
అయితే బంగ్లాదేశ్ జెండాను ఆవమానించారనే ఆరోపణలతో 2024 నవంబర్ 25న పోలీసులు ఈయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన జైల్లో ఉన్నారు. ఇక చిన్మయి కృష్ణదాస్ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత ఆయన కేసును వాదించేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ దాడిలో ఒక న్యాయవాది మరణించారట. బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ మౌనాన్ని కూడా సిక్రీ ప్రశ్నించారు. అయితే చిన్మయి భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ పదకొండు మంది లాయర్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఆయన తరుపున వాదనలు వినిపించారు.
హిందూ సాధువు, బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ జోతే అధికారి ప్రతినిధి ఈ చిన్మయ్ కృష్ణదస్. అయితే ఈయన చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఉన్నప్పుడు ఆయన బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారని ఫిర్యాదు రావడంతో కేసు నమోదుచేశారు పోలీసులు. ఇక ఈయనను 2024 నవంబరు 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇక ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు వద్ద జరిగిన ఘర్షణలో ఓ లాయర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన మరింత తీవ్రం అయింది.