
అమెరికా ఉపాధ్యక్షురాలు కమాల హారిస్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తెలెత్తడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసరంగా విమానాన్ని దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గ్వాటెమాలా వెళ్లేందుకు కమలా హారిస్ ఆదివారం సాయంత్రం వాషింగ్టన్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో సాయంత్రం వాషింగ్టన్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో బయల్దేరారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతికలోపం తెలెత్తింది. దీంతో సిబ్బంది విమాన్ని తిరిగి ఎయిర్ బేస్ కు మళ్లించి అత్యవసరంగా దించేశారు. టేకాఫ్ అయిన తర్వాత కొద్ది క్షణాలకు ల్యాండింగ్ గేర్ లో అసాధారణ శబ్ధం వచ్చినట్లు విమానంలో ఉన్న జర్నలిస్టు ఒకరు తెలిపారు.