కరోనా పీడ వదులుతోంది.. లక్షలోపే కేసులు!

కరోనా పీడ వదులుతోంది. కేసులు దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రాలన్నీ కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్నాయి. పాజిటివిటీ రేటు దేశంలో భారీగా తగ్గుతోంది. ఏపీ, తెలంగాణలోనూ దీని తీవ్రత భారీగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లోనే కరోనా కేసులు లక్షకు దిగిరావడం ఎంతో ఊరట కలిగించే పరిణామంగా మారింది. గత 24 గంటల్లో కొత్తగా 1000636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28.90 లక్షలకు చేరింది. 27 లక్షల మంది […]

Written By: NARESH, Updated On : June 7, 2021 10:29 am
Follow us on

Doctors looking after infected patients in hospital, coronavirus concept.

కరోనా పీడ వదులుతోంది. కేసులు దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రాలన్నీ కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్నాయి. పాజిటివిటీ రేటు దేశంలో భారీగా తగ్గుతోంది. ఏపీ, తెలంగాణలోనూ దీని తీవ్రత భారీగా తగ్గుముఖం పడుతోంది.

తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లోనే కరోనా కేసులు లక్షకు దిగిరావడం ఎంతో ఊరట కలిగించే పరిణామంగా మారింది. గత 24 గంటల్లో కొత్తగా 1000636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28.90 లక్షలకు చేరింది. 27 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా 14లక్షల యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. 3.49 లక్షల మంది కరోనాతో చనిపోయారు. నిన్న 2427మంది మృతి చెందారు.

దేశంలో వ్యాక్సినేషన్ కూడా ఊపందుకుంది. ఇప్పటివరకు 23 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు దేశంలో కరోనా పాజిటివిటీ రేటు ఇప్పుడు 60శాతానికి తగ్గడం ఎంతో ఊరట కలిగిస్తోంది. దేశంలో ఒక దశలో 37 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ నంబర్ 15 లక్షల్లోపు నమోదవుతూ ఉంది. రోజురోజుకు లక్షకు పైగా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. టెస్టుల సంఖ్యతో పోలిస్తే పాజిటివిటీ రేటు బాగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం ఆరు శాతంలోపు కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా మరణాల సంఖ్య భారీగా తగ్గింది.

ఏపీలోనూ కరోనా తీవ్రత తగ్గింది. ఏపీ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఖాళీగా బెడ్స్ దర్శనమిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ లాగా సెకండ్ వేవ్ కూడా ముగిసినట్టేనని భావిస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది ప్రాణాలు పోయి వేల మంది కోవిడ్ బారినపడడమే విషాదం నింపింది. ఒకనొక సెకండ్ వేవ్ సంయంలో ఏపీలో రోజుకు 20వేలకు పైగా కేసులు నమోదై ఆందోళన నెలకొంది. ఒకవైపు ఆక్సిజన్ బెడ్లు దొరక్క.. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల రోదన అంతా ఇంతాకాదు..

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఖాళీలు కనపడడం ఊరటనిస్తోంది. 80 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య ఐదులోపే అని తెలుస్తోంది. 58 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితులు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గొప్ప ఊరటగా చెప్పుకొవచ్చు. 25 కోవిడ్ సంరక్షణ కేంద్రాల్లో బాధితులు అసలు లేరనే గణాంకాలు ఏపీలో కరోనా తీవ్రత తగ్గిందనడానికి ఊరటనిస్తోంది.

ఇక తెలంగాణలోనూ హైదరాబాద్ మినహాయించి జిల్లాల్లో తీవ్రత తగ్గింది. హైదరాబాద్ లోనూ బెడ్స్ ఈజీగానే దొరుకుతున్నాయి. పక్కరాష్ట్రాల నుంచి రోగులు రావడంతో ఇక్కడ కొంచెంతాకిడి ఉంది. కేసుల సంఖ్య 2వేల లోపే నమోదవుతున్నాయి. మరణాలు తగ్గుముఖం పట్టాయి. మొత్తం కరోనా పీడ దేశానికి ప్రస్తుతానికి విరగడనట్టైంది. ఇక మూడో వేవ్ కోసం ముందస్తుగా సిద్ధమైతేనే మనకు మనుగడ.