spot_img
Homeక్రీడలుక్రికెట్‌Kane Williamson Comments On Team India: ప్రపంచ క్రికెట్ జట్ల నుంచి ఆటగాళ్లు వచ్చినా.....

Kane Williamson Comments On Team India: ప్రపంచ క్రికెట్ జట్ల నుంచి ఆటగాళ్లు వచ్చినా.. టీమ్ ఇండియాను ఓడించలేరు!

Kane Williamson Comments On Team India: వరుసగా రెండవసారి.. మొత్తంగా మూడవసారి టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. పొట్టి క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద 96 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా సాధించిన విజయం పట్ల యావత్ ప్రపంచం మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఇక టీమ్ ఇండియా అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?

టి20 వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇందులో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కెన్ విలియంసన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. టీమిండియా సాధించిన విజయాన్ని అతడు చెప్పిన తీరు గొప్పగా ఉంది. ఇదే సమయంలో టీమిండియా విజయం పట్ల అసూయ వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్.. ఇతర సో కాల్డ్ వ్యక్తులకు కేన్ విలియంసన్ మాట్లాడిన మాటలు చెప్పు దెబ్బ మాదిరిగా ఉన్నాయి.

కేన్ విలియంసన్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు గెలవాలని కోరుకున్నాడు. కానీ, వాస్తవ ఫలితం మరో విధంగా వచ్చింది. దీంతో విలియంసన్ రియలైజ్ అయిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా టీమిండియా ప్లేయర్లు ఆడిన తీరు గొప్పగా ఉందని అతడు పేర్కొన్నాడు. “టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. బీభత్సంగా బ్యాటింగ్ చేశారు. విధ్వంసానికి పరాకాష్టగా ఆటతీరు కొనసాగించారు. అయితే టీమిండియాను ఓడించాలి అంటే ప్రపంచంలో క్రికెట్ ఆడే ఉత్తమ జట్ల నుంచి.. ఉత్తమ ప్లేయర్లను 11 మందిని తీసుకున్నప్పటికీ.. వారిపై కూడా టీమిండియా గెలుస్తుందని” విలియంసన్ పేర్కొన్నాడు.

“కేవలం బెస్ట్ టీం ల నుంచి బెస్ట్ ప్లేయర్లను మాత్రమే కాదు, గ్రహాల నుంచి గ్రహాంతరవాసుల ను తీసుకొచ్చినప్పటికీ టీమ్ ఇండియాకు ఓటమి అనేది ఎదురు కాదు. ఎందుకంటే ఆ జట్టులో ప్లేయర్లు ఇప్పుడు భీకరంగా ఆడుతున్నారు. దేశం కోసం ఎక్కడి దాకైనా వెళ్లే విధంగా కనిపిస్తున్నారు. వారిని ఓడించడం కాదు కదా.. కనీసం గట్టి ఫైట్ ఇవ్వడం కూడా ఇతర ప్లేయర్లకు సాధ్యం కాకపోవచ్చని” విలియమ్సన్ వ్యాఖ్యానించాడు.. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.
.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper