
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న స్పందించారు. ఇప్పటికే ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన సీఎం జగన్ ఇప్పుడు నిరుద్యోగ యువతతో మాంసం అమ్మించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా వారిని దుకాణాల్లో నియమించడం సిగ్గుచేటని అన్నారు. ఉపాధ్యాయులతో మద్యం అమ్మించినప్పుడే జగన్ ఆలోచనలు ఎలా ఉంటాయో అర్ధమయిందని ఎద్దేవా చేశారు.