Mana Shankara Varaprasad Twitter Talk: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ ప్రీమియర్ షోస్ నిన్న రాత్రి గ్రాండ్ గా మొదలై మంచి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలకు సోషల్ మీడియా లో పాజిటివ్ టాక్ రావడం చాలా కష్టం, ఆయన ఆడియన్స్ సోషల్ మీడియా లో చాలా తక్కువ ఉంటారు. అలాంటిది సోషల్ మీడియా […]
Mana Shankara Varaprasad Twitter Talk: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ ప్రీమియర్ షోస్ నిన్న రాత్రి గ్రాండ్ గా మొదలై మంచి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలకు సోషల్ మీడియా లో పాజిటివ్ టాక్ రావడం చాలా కష్టం, ఆయన ఆడియన్స్ సోషల్ మీడియా లో చాలా తక్కువ ఉంటారు. అలాంటిది సోషల్ మీడియా లో ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎబోవ్ యావరేజ్ రేంజ్ టాక్ రావడం నిజంగా సర్ప్రైజ్ కి గురి చేసే విషయమే. మెగా ఫ్యాన్స్ పాజిటివ్ టాక్ చెప్పడం లో పెద్ద వింతేమీ లేదు కానీ, నందమూరి ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ చెప్పడం గమనార్హం. ఓవరాల్ గా ట్విట్టర్ జనాల ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గానే మొదలు అవుతుంది. కానీ మొదటి 15 నిముషాలు తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన విశ్వరూపం చూపించేసాడు అనే చెప్పాలి. ఒకప్పుడు ఆయన యాక్టింగ్ లో ఉండే ఈజ్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుదిరాయి. అనిల్ రావిపూడి అంటే క్రింజ్ కామెడీ అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి క్రింజ్ కామెడీ లేదు. చాలా క్లీన్ కామెడీ తో చిరంజీవి ని ఎందుకు ఆడియన్స్ అంతలా ఇష్టపడతారో నేటి తరం ఆడియన్స్ కి చూపించేలా చేసాడు. ఫస్ట్ హాఫ్ లో నాలుగు బ్లాక్స్ కామెడీ వర్కౌట్ అయ్యింది. హుక్ స్టెప్ పాత అదిరింది అనుకుంటే , శశిరేఖ పాట అంతకంటే అదిరిపోయింది అని అంటున్నారు చూసిన ఆడియన్స్. ఇక ఇంటర్వెల్ పది నిముషాలు వచ్చే పాట వేరే లెవెల్ లో ఉందని, ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ అని అంటున్నారు.
ఇక సెకండ్ విషయానికి వస్తాయి ఆరంభం డీసెంట్ గానే ఉంది కానీ, మధ్యలో మూవీ పేస్ బాగా తగ్గిందని, కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదని అంటున్నారు. ముఖ్యంగా సినిమాకు ఎంతో హైప్ ని క్రియేట్ చేసిన వెంకటేష్ కాంబినేషన్ సన్నివేశాలు చాలా యావరేజ్ గా అనిపించాయని అంటున్నారు. వెంకటేష్ పాత్ర సినిమాని పైకి లేపడం కోసమే పెట్టినట్టు ఉంది కానీ, బలమైన ప్రభావం చూపలేదని అంటున్నారు. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఓవరాల్ హిట్ సినిమా అని అంటున్నారు. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు వింటేజ్ మెగాస్టార్ భుజాల మీదనే నడిచిందని, మెగాస్టార్ వన్ మ్యాన్ షో అని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు.