Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Varaprasad Review : 'మన శంకర వర ప్రసాద్' మూవీ లో ప్లస్...

Mana Shankara Varaprasad Review : ‘మన శంకర వర ప్రసాద్’ మూవీ లో ప్లస్ లు, మైనస్ లు ఇవేనా..?

Mana Shankara Varaprasad Review: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను అధ్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన అనిల్ రావిపూడి తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాని అనుకున్న రేంజ్ లో సక్సెస్ చేయలేకపోయాడనే చెప్పాలి. మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి టాక్ మూటగట్టుకుంటుంది […]

Mana Shankara Varaprasad Review: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను అధ్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన అనిల్ రావిపూడి తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాని అనుకున్న రేంజ్ లో సక్సెస్ చేయలేకపోయాడనే చెప్పాలి. మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి టాక్ మూటగట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అనేవి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇక ఈ సినిమాలో చిరంజీవి నటన చాలా వరకు ప్లస్ అయింది. అలాగే తన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాకి కొంతవరకు కలిసి వచ్చింది. ఇక తన గ్రేస్ తో చేసిన డ్యాన్సులు ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. అలాగే పాటలు సైతం ఈ సినిమాకి చాలా వరకు అడ్వాంటేజ్ గా నిలిచాయి… ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు సైతం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి…

ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోవడం, చిరంజీవిని రొటీన్ సినిమాల మాదిరిగానే చూపించడం, పెద్దగా ఎమోషన్స్ కి స్కోప్ ఇవ్వకపోవడం లాంటివి ఈ సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యాయి. ఇక ఏది ఏమైనా అభిమానులకు ఈ సినిమా విపరీతంగా నచ్చినప్పటికి సగటు ప్రేక్షకులకు మాత్రం అంత పెద్దగా నచ్చలేదనే చెప్పాలి.

చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే ప్రేక్షకులు చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా లేదనే చెప్పాలి…అనిల్ రావిపూడి సైతం ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసుకొని ఈ సినిమాని చేశానని చెప్పాడు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper