Chiranjeevi Gangubhai Role Movie: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రేపు తన 70వ పుట్టినరోజు ని గ్రాండ్ గా జరుపుకోబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. 7 పదుల వయస్సులో ఆయన సినీ ప్రస్థానం దాదాపుగా 45 ఏళ్ళ వరకు ఉంటుంది. ఈ 45 ఏళ్ళు ఆయన సాధించిన విజయాలు, చూసిన ఎత్తుపల్లాలు ఒక మనిషి తన జీవితం లో పైకి ఎదగడానికి దిక్సూచి లా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కెరీర్ ప్రారంభం లో కష్టపడినట్టే కష్టపడుతూ, ఎంతో చలాకీగా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ, వాళ్ళతో సమానంగా ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘విశ్వంభర'(Viswambhara Movie) మరియు అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా ఉంది. ఇందులో విశ్వంభర చిత్రం పూర్తి అయ్యింది, కానీ గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడం తో వచ్చే ఏడాది సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది ఈ చిత్రం.
Also Read: విశ్వంభర మూవీ నుంచి భారీ అప్డేట్: చిరంజీవి సంచలన ప్రకటన…వైరల్ వీడియో…
ఇక అనిల్ రావిపూడి తో చేస్తున్న చిత్రం అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా, రేపు మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమాని ప్రారంభించబోతున్నాడు. డైరెక్టర్ బాబీ(Bobby Kolly) దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు రేపు ముహూర్తం షాట్ పడనుంది. డైరెక్టర్ బాబీ గతంలో మెగాస్టార్ చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించాడు. అభిమానులు చిరంజీవి ని ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో అలా చూపించాడు ఈ చిత్రంలో. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి లో పూర్తి స్థాయి కామెడీ టైమింగ్ ని తీసుకొచ్చింది డైరెక్టర్ బాబీ నే. ఈసారి మెగాస్టార్ ని ఎలా చూపించబోతున్నాడు అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి ‘గంగూభాయ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట.
Also Read: చిరంజీవి బర్త్ డే కి అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేశాడంటే..?
ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు రేపు తెలియనున్నాయి. అనిల్ రావిపూడితో చిరంజీవి చిత్రం వచ్చే నెల తో పూర్తి అవుతుంది. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన ఈ చిత్రానికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. వాస్తవానికి ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఆయన శ్రీకాంత్ ఓదెల చిత్రానికి షిఫ్ట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ చిత్రం తో బిజీ గా ఉండడం వల్ల ఆ సినిమా పూర్తి అయ్యాకనే ఈ చిత్రం మొదలయ్యే సూచనలు ఉండదా తో, ఈలోపు డైరెక్టర్ బాబీ చిత్రాన్ని లైన్ లోకి తీసుకొచ్చాడు మెగాస్టార్. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న ఈ రెండవ సినిమా కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది.