Bangladesh illegal immigration : నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్.. ఓ డైలాగ్ అంటాడు గుర్తుందా.. ఈ ప్రపంచంలో ప్రతి సంఘటనను నేచర్ డిసైడ్ చేస్తుందని.. ఎక్కడ వాలే సీతాకోకచిలుకలు.. మరెక్కడో కురిసే వర్షాన్ని ముందే చెప్పేస్తాయని.. సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ఇది వర్షం కాదు.. సీతాకోకచిలుకలు అంతకంటే కాదు.. ఇది ముమ్మాటికి నల్లటి దందా. అక్షరాల 900 కోట్ల చీకటి వ్యాపారం. ఇన్నాళ్లు తెలుపు చీర కట్టుకొని.. దీదీ అంటూ ప్రశంసలు పొందిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసలు స్వరూపం.
900 కోట్లు.. ఇదేమి చిన్న స్థాయి డబ్బు కాదు. సిక్కిం రాష్ట్ర బడ్జెట్లో దాదాపు సింహభాగం. ఇంతటి డబ్బు కొన్ని సంవత్సరాలుగా దర్జాగా చేతులు మారింది. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండంగా సరిహద్దులు దాటిపోయింది. బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నంతకాలం ఈ చీకటి కోణానికి అడ్డు అనేది లేకుండా సాగిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ బిజెపి గెలిచిందో అప్పుడే కథ మారింది. 900 కోట్ల నలుపు ధనం ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో మమత అసలు రంగు బయటపడుతోంది.
మనకు తెలుసు కదా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుందని.. ఇక్కడ సుమారు 1000 పాయింట్లు ఉంటాయి. ఈ పాయింట్ల ద్వారా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి రోజుకు వందలమంది అక్రమ మార్గాలలో ప్రవేశించేవారు. బెంగాల్ ప్రజలు దీనిని ధూర్ పారాపార్ అని పిలుస్తుంటారు. దీనికి అర్థం సరిహద్దులు దాటించడం. ఈ సరిహద్దులు దాటించే విధానం కూడా ఇక్కడ మూడు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది.
స్థానికంగా ఉండే అక్రమార్కులు.. వీరు బంగ్లాదేశ్ ప్రజలతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటారు. ఈ ఆక్రమార్కులు మొత్తం టిఎంసి పార్టీకి చెందిన వారై ఉంటారు. బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి రావాలనుకునే ఒక్కొక్కరి నుంచి 15 వేల టాకాల వరకు వసూలు చేస్తూ ఉంటారు. వారిని మన దేశ సరిహద్దు వరకు అత్యంత సురక్షితంగా తీసుకొస్తుంటారు.
పర్యవేక్షకులు
ఈ పర్యవేక్షకులు కూడా మమత పార్టీకే చెందిన వారే. వీరు బంగ్లాదేశ్ ప్రజలను జనపనార చేలలో ఉంచుతారు. జవాన్ల కళ్ళు కప్పి సరిహద్దులను దాటిస్తుంటారు. రాత్రిపూట ఈ పనులు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో బంగ్లాదేశ్ ఆడవాళ్ళ మీద ఆ పని కూడా చేస్తుంటారు. అయితే బంగ్లాదేశ్ ఆడవాళ్లు కూడా ఆ పనికి ఒప్పుకోవడం విశేషం. ఎలాగూ దేశం నుంచి ఇండియాకు వస్తున్నాం కాబట్టి.. ఇది పెద్ద విషయం కాదని అక్కడి మహిళలు వ్యాఖ్యానించడం కొసమెరుపు.
పహారా కాసేవాళ్లు
వీరిని గైడ్స్ అని పిలుస్తుంటారు. వీరు హౌరా.. సీయల్దా రైల్వే స్టేషన్లకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని అక్రమంగా తరలిస్తారు. అక్కడినుంచి దేశం నలుమూలకు పంపిస్తుంటారు. ఇది చెప్పడానికి సులభంగానే ఉన్నప్పటికీ.. దీని వెనక చాలామంది చేతులు ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం ప్రతి ఏడాది ఇలా 900 కోట్ల రూపాయలను ఇలా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినందుకు ఇక్కడ టీఎంసీ నాయకులు వసూలు చేస్తూ ఉంటారు.
ఇక్కడితోనే ఆగిపోలేదు.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి మన దేశ పౌరసత్వాన్ని.. గుర్తింపు కార్డులను.. చివరికి ఓటు హక్కును కూడా కల్పించడం మమత నాయకత్వంలోనే సాగిపోయింది. దీనికోసం పెద్ద మాఫీ అని వచ్చింది. ఈ అక్రమార్కులకు ధ్రువపత్రాలు అందించడానికి టిఎంసి ప్రభుత్వం కొంతమంది వ్యక్తులను అనధికారికంగా నియమించింది. వారంతా కూడా పాత పత్రాలను సృష్టించి.. వాటిని రంగు నీళ్ళల్లో ముంచి.. పాడైపోయాయని నమ్మించేవారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు పొందేవారు.
ఎప్పుడైతే బిజెపి ఇక్కడ అధికారంలోకి వచ్చిందో.. బంగ్లాదేశ్ నుంచి వలసలు ఆగిపోయాయి. సరిహద్దుల్లో రక్షణ గోడలు నిర్మితమవుతున్నాయి. అంతేకాదు 900 కోట్ల నల్లధనం ఆగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశ ప్రజలకు.. ముఖ్యంగా బెంగాల్ వాసులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఇప్పటికే కట్ మనీ ఆగిపోయింది. కట్ మనీ తీసుకున్నవాళ్లు తిరిగి ఇచ్చేస్తున్నారు.
