
సినీ నటుడు కత్తి మహేష్ కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లాలోని కొడవలూపు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సినీ నటుడు కత్తి మహేష్ కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం నెల్లూరు మెడికేర్ హాస్పటల్ లో కత్తి మహేష్ చికిత్స పొందుతున్నారు.