
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 17,45,809 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 48,698 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. ఈనెలలో రెండోసారి రోజువారీ కేసులు 50 వేల దిగువకు చేరాయి. తాజాగా మరో 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,83,143కి చేరగా 3,94493 మంది ప్రాణాలు కోల్పోయారు.