Khaleja Movie Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా రీరిలీజ్ సందర్భంగా అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. విజయవాడలో ఈ సందర్భంగా ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఖలేజా సినిమాలో మహేష్ బాబు పాముతో ఎంట్రీ ఇవ్వడం గుర్తుండే ఉంటుంది. అదే సీన్‌ను అనుసరిస్తూ ఓ అభిమాని నిజమైన పాము పిల్లను తీసుకుని థియేటర్‌లోకి వచ్చాడు.
ప్రేక్షకులు తొలుత అది రబ్బర్ పాము అనుకొని నవ్వుకున్నారు. కానీ అది నిజమైన పాము అని తెలిసిన వెంటనే హాల్‌లో భయభ్రాంతులు నెలకొన్నాయి. దీంతో కొంత కలకలం రేగింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అభిమానంలో మితి తప్పకూడదని పలువురు సూచిస్తున్నారు.
#Khaleja4KReRelease
విజయవాడ సినిమా హాల్ లో పాము కలకలం..#Khaleja4K రీరిలీజ్ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహం..#MaheshBabu ఎంట్రీ సీన్ లో పాముతో నడిచివచ్చే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయడం కోసం నిజమైన పాముతో ధియేటర్లోకి వచ్చిన అభిమాని..
మొదట రబ్బర్ పాము అనుకున్న మిగిలిన ఫ్యాన్స్..… pic.twitter.com/Lwk9i5IFFY— The Cult Cinema (@cultcinemafeed) May 30, 2025