khaleja from flop to hit : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన కంటూ ఒక గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన్ని మిగతా హీరోలకంటే సెపరేట్ చేసి చూపిస్తున్నాయి. 2010 వ సంవత్సరం లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఖలేజా (Khaleja) సినిమా రిలీజ్ సమయంలో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కానీ ఇప్పుడు రీరిలీజ్ లో మాత్రం భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో ఎవ్వరికి అర్థం కాలేదు. కానీ సినిమా చూసిన వాళ్ళందరూ బావుంది అని చెప్పినప్పటికి సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడం విశేషం…ఇక మొత్తానికైతే నిన్న రీరిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది అంటూ మేకర్స్ అయితే తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు లాంటి గొప్ప నటుడు తనలోని కామెడీ టైమింగ్ మొత్తాన్ని బయటికి తీసి చేసిన మూవీ కూడా ఇదే కావడం విశేషం…
మరి ఈ సినిమాతో మహేష్ బాబు ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తన ఫ్యాన్స్ కి కూడా చాలా వరకు దగ్గరయ్యాడు. ఇక అంతకు ముందు చేసిన సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాయి… కానీ ఈ సినిమా మాత్రం ప్లాప్ అయినప్పటికి ఆయనకి గొప్ప గుర్తింపును తీసుకురావడం లో చాలా వరకు హెల్ప్ అయింది.
మొత్తానికి ఈ సినిమా వల్ల ఆయన చాలా వరకు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగే అవకాశం అయితే దక్కింది. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తూ ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఖలేజా మూవీ రీ రిలీజ్ లో అదరగొడుతోంది అనే విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘ఖలేజా’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్..కానీ ‘గబ్బర్ సింగ్’ ని ముట్టుకోలేకపోయిందిగా!
త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుండడం విశేషం…ఇక ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు…