Madhavi Latha : మగాళ్లు మందు తాగితే ఈ సమాజం పెద్దగా పట్టించుకోదు. ఆడవాళ్ళు తాగితే వింతగా చూస్తుంది. ఘోరం అన్నట్టుగా ముద్ర వేస్తుంది. ఆమెను చెడుగా చూస్తుంది. ఇంటి పని విషయంలో ఆడవాళ్లు చేస్తే ఈ సమాజం ఒక విధంగా చూస్తుంది. అదే మగవాళ్ళు చేస్తే ప్రపంచానికి ఏదో అరిష్టం పట్టినట్టు.. అదేదో ఘోరం జరిగిపోయినట్టు చూస్తుంది.. ఇంటి పని ఆడవాళ్లకు మాత్రమే సొంతమా.. మగవాళ్ళు చేయకూడదా.. మగవాళ్ళు చేస్తే ఏమైనా కిరీటాలు రాలిపోతాయా.. ఇదిగో ఇలా ప్రశ్నించింది ఆమె. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా అవుతోంది.
ఇంతలా ప్రశ్నించిన ఆమె పేరు మాధవి లత. గతంలో కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నాయకురాలిగా కొనసాగుతోంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా పోస్టులు పెడుతూ.. ఏదో ఒక విధంగా వీడియోలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది మాధవి లత. స్త్రీవాదం గురించి మాధవి లత గొప్పగా చెబుతుంటారు. కొన్ని సందర్భాలలో కట్టు తప్పుతుంటారు. అయినప్పటికీ ఆమెను కొంతమంది సమర్థిస్తారు. మరికొంతమంది విమర్శిస్తారు. ఎవరు ఎలా ఉన్నా సరే మాధవి లత మాత్రం తన ధోరణి మార్చుకోరు. తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెబుతూనే ఉంటారు.. అందువల్లే ఆమె బిజెపిలో ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎదిగారు..
మాధవి లత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ముఖ్యంగా మద్యం తాగే విషయంలో మగవాళ్ళను ఒక విధంగా.. ఆడవాళ్లను మరొక విధంగా ఈ సమాజం చూస్తుందని.. అది ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఇంటి పని విషయంలో కూడా మగవాళ్ళు చేస్తే ఒక విధంగా.. ఆడవాళ్లు చేస్తే మరొక విధంగా ఈ సమాజం చూస్తుందని.. అది సరైనది కాదు అంటూ ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆమె ఈ పోస్ట్ చేసిన తర్వాత చర్చ మొదలైంది. కొంతమంది ఆమెకు అనుకూలంగా.. మరి కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎవరు ఎలా అనుకున్న సరే మాధవి లత తన అభిప్రాయాన్ని మాత్రం చెబుతూనే ఉంటారు. ఏ మాత్రం వెనకడుగు వేయరు.
బిజెపిలో ఫైర్ బ్రాండ్ లీడర్లలో మాధవి లత ఒకరుగా ఉన్నారు. గతంలో ఆమె కొన్ని సినిమాలలో నటించారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆడవాళ్ళ విషయంలో మొహమాటం లేకుండా తన స్వరాన్ని వినిపిస్తున్నారు. ఒకవేళ ఆడవాళ్లు తప్పులు చేస్తే ఎటువంటి వెనుకంజ వేయకుండా గట్టిగా మాట్లాడుతున్నారు. తాజాగా మద్యం తాగే విషయంలో సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి.. చర్చ మొదలుపెట్టారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
