Rajamouli: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు సినిమాలు చేసిన కొంతమందికి మాత్రమే చాలా మంచి ఇమేజ్ ఏర్పడుతోంది. వాళ్ళ సినిమాలు ప్రేక్షకులకు నచ్చడమే కాకుండా ఇండియన్స్ స్క్రీన్ మీద వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళలో రాజమౌళి ఒకరు… ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రాజమౌళి మీద వివాదాలే మనకు కనిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఆయన రీసెంట్ గా తన సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్లో వాళ్ల నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నా కొడుకు ఈ సినిమా చేస్తున్నాడంటే వాడి వెనకాల హనుమంతుడు ఉండి నడిపిస్తున్నాడు అని చెప్పాడు. కానీ రాజమౌళి మాత్రం ‘నా వెనకాల ఎవరు లేరు నేను హనుమంతుడిని నమ్మను’ అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కారణమేదైనా కూడా రాజమౌళి చేసింది తప్పే అంటూ చాలామంది అతన్ని విమర్శిస్తూ వీడియోలను కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా బిజెపిలో ఆక్టివ్ మెంబర్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మాధవి లత గారు సైతం రాజమౌళి మీద కొన్ని విమర్శలైతే చేశారు… ఆమె మాట్లాడుతూ రాజమౌళి గారు మీరు బాహుబలి సినిమాలో ప్రభాస్ చేత శివలింగాన్ని ఎత్తించి కొన్ని కోట్లు సంపాదించారు.
అప్పుడు మీరు ఏమైనా దేవాలయాలకు దానధర్మాలు ఏమైనా చేశారా? లేదు కదా! మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు మీకు ఏదో ప్రాబ్లం వచ్చిందని నేను దేవుడిని నమ్మను అంటూ కామెంట్లు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీలాంటివారు దేవుళ్లను గౌరవిస్తేనే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది.
అంతేతప్ప దేవుళ్ళను దూషిస్తే మీకు వచ్చేది ఏమీ లేదు. మీ డబ్బుల కోసం, దేవుళ్లను సినిమాల్లో వాడుకుంటున్నారు. అదే విషయాన్ని జనానికి తెలిసేలా చెబితే బాగుంటుంది. మీకు ఆ రోజు ఈవెంట్ లో ఏదో అయిందని దేవుడిని దూషించడం కరెక్ట్ కాదు అంటూ మాధవి లత గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తానికైతే ఆమె చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది మాత్రం ఆయన దేవుడిని నమ్మనని చెప్పాడు.
దానికి అతని విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఆయన తను ఒపీనియన్ మాత్రమే చెప్పాడు. దాంట్లో ఇబ్బంది ఏంటి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వివాదానికి రాజమౌళి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తాడా? లేదంటే ఇంకా కొన్ని రోజులపాటు ఈ వివాదం ఇలాగే కొనసాగుతుందా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
