Kodali Nani: వైసీపీ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి కృష్టా జిల్లా ఎస్పీ గంగాధర్ నోటీసులు జారీ చేశారు కొడాలి నాని కదలికలపై నిఘా పెట్టాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. దీంతో డీజీపికి టీడీపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో అమెరికాకు పరారయ్యే అవకాశం ఉందని లుకౌట్ నోటీసులు జారీ చేశారు.