Heavy rains : ఎండాకాలం అనగానే చాలామందికి భయం వేస్తుంది. ఓవైపు వేడి మరోవైపు ఉక్కపోతతో మూడు నెలల పాటు అవస్థలు పడాల్సి వస్తుంది. మార్చి అయిపోగానే జూన్ వరకు వేసవి కాలం కొనసాగుతుంది. అయితే ఈసారి వేసవికాలం తక్కువ రోజుల్లోనే ముగిసిపోయింది. మే నెల పూర్తి కాకముందే వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఇక వర్షాకాలం ప్రారంభమైనట్లేనని తెలుస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే వేసవి కాలాన్ని వరుడు తగ్గించినట్లు అనుకోవాలి. అయితే ఓవైపు ఎండ వేడి నుంచి బయటపడ్డామని ప్రజలు అనుకుంటుంటే.. రైతులు కొందరు మాత్రం తమ ధాన్యం తడిచిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ శాఖ ప్రకారం ఈ ఏడాది మే 31 నుంచి నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. కానీ అంతకంటే ముందు నుంచే వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు ఏరులై పారుతున్నాయి. అయితే అకాల వర్షాలు అనుకుంటే ఒకటి రెండు రోజుల్లో కురిసి వెళ్లిపోయేవి. కానీ ప్రస్తుతం వరుసగా జోరు వానలు కురుస్తుండడంతో ఇక వర్షాకాలం ప్రారంభమైనట్లేనని అనుకుంటున్నారు. అయితే సాధారణంగా రోహిణి కార్తె ప్రారంభమైన తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉండేది. కానీ ఈసారి రోహిణి కార్తె రాకముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read : ఆ నాలుగు జిల్లాల్లో హై అలెర్ట్ .. బయటకు రావద్దు.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక!
2025 మే 25 నుంచి రోహిణి కాకపోతే ప్రారంభమవుతుంది. ఇప్పటినుంచి వర్షాలు కురిస్తే వర్షాలు తక్కువగా ఉంటాయని కొందరు నమ్ముతారు. మరోవైపు రోహిణిలో ఎండలు బాగా ముదిరిపోతాయి. రోహిణి కార్తెలో ఎలాంటి వర్షం లేకపోతే ఆ తర్వాత వర్షాలు సమృద్ధిగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఈసారి ఎవరు ఊహించని విధంగా రోహిణి కార్తీకు ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ వర్షాలు ఇలాగే కురుస్తాయా? లేక మధ్యలోనే ఆగిపోతాయా? అనేది తెలియకుండా ఉంది. అయితే ఇలాగే వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లగా ఉంటే మాత్రం ఈసారి వర్షాకాలం ముందే వచ్చి నట్లు అనుకోవాలి. అలాకాకుండా ఆ తర్వాత ఎండలు కొనసాగితే వీటిని అకాల వర్షాలు అని అనుకోవాలని కొందరు అంటున్నారు.
ఈ వర్షాల వల్ల కొందరికి లాభం జరగదా మరికొందరికి నష్టం జరిగింది. ఇన్ని రోజులు ఎండ వేడితో.. ఉక్కపోతతో భరించలేని ప్రజలు ఈ వర్షాలకు కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు వాతావరణం వేడిగా ఉండడంతో కొన్ని పనులు పూర్తి చేసుకోలేకపోయారు. కానీ ఈ అకాల వర్షాల వల్ల రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. కొందరు ధాన్యం విక్రయించుకోకముందే వర్షాలు పడడంతో ధాన్యం మొత్తం నీటిపాలైంది. దీంతో రైతులు పడ్డ కష్టం వృథా అయింది. అయితే మరోసారి కూడా వర్షాలు ఇలాగే కురుస్తాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.