
కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇవాళ 5,528 మందిపై కేసులు నమోదు చేశారు. 4829 వాహనాలను జప్తు చేశారు. అదేవిధంగా మాస్కులు ధరించని 1412 మందిపై కేసులు పెట్టారు.