
తమిళనాడులో కొనసాగుతున్న లాక్ డౌన్ ను ఈనెల 21 వరకూ పొడిగించారు. అయితే లాక్ డౌన్ ఆంక్షలను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు లో 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటల వరకు అనుమతిస్తామని ప్రబుత్వం పేర్కొంది. టాక్సీలు, నడుస్తాయని వెల్లడించిది. అలాగే ప్రభుత్వ పార్కులు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారు.