
దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు ఆ రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకటించింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొంత భాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, రాగల రెండు మూడు రోజుల్లో తెలంగాలనోని దక్షిణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ సంచాలకులు నాగరత్నం తెలిపారు. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.