
సరదాగా స్నానం చేసేందుకు దిగి తెలుగు గంగ కాలువలో నీటమునిగి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా బీఎన్ కండ్రిగ మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతి చెందిన యువకులను అరవింద్ (18) రాజు(25) ప్రభుగా (30) గా గుర్తించారు. మృతదేహాలను పోలీసులు కాలువ నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.