
నిధుల సమీకరణ కోసం తెలంగాణలో వివిధ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. మంత్రి వర్గం నిర్ణయం మేరకు వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల అమ్మాకానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఖారారు చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం మార్గదర్శకాలు జారీ చేసింది.