ఈ కరోనా కష్ట సమయంలో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ, తనకు చేతనైనంత సేవ చేస్తున్నాడు హీరో నిఖిల్. ఈ లాక్ డౌన్ టైంలో నిఖిల్ చేసిన సేవను నిజంగా మెచ్చుకోవాలి. నిఖిల్ లాగా ఏ యంగ్ హీరో ఇలా ఓపెన్ గా సేవ చేయలేదు. ఏ హీరో నిఖిల్ లా సామాన్య ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చలేదు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని ఎందరో కోవిడ్ బాధితులను ఆదుకున్నాడు నిఖిల్.
ఇప్పుడు గ్రామాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతాను అంటూ ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఈ కరోనా మహమ్మారి పై మనం చేసే పోరాటానికి మనకు ఉన్న ఏకైక ఆయుధం వాక్సినేషన్ మాత్రమే అని అందరూ గ్రహించాలి. ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారనే విషయాన్ని మనమందరం ప్రతి ఒక్కరికీ చేరవేయాలి.
అదే విధంగా సిటీస్ లోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వ్యాక్సినేషన్ వేస్తున్నారు. కాబట్టి, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత త్వరగా వాక్సినేషన్ వేయించుకొని, మిమ్మల్ని అలాగే మీ ఫ్యామిలీని కాపాడండి. మా టీమ్ తో నా వంతుగా ప్రతివారం ఒక గ్రామానికి వెళ్లి ఫ్రీగా పేద ప్రజలకు వ్యాక్సినేషన్ వేస్తున్నాము.
అయితే, మీరందరికి ఒక మనవి. ఎవరైతే వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అనుకుంటున్నారో.. వాళ్ళు ActorNikhil ఇన్స్టా అకౌంట్ లో ట్యాగ్ చేయండి. మా టీమ్ మీకు వ్యాక్సిన్ వేయించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తుంది’ అంటూ నిఖిల్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్ ప్రస్తుతం ’18 పేజెస్’, ‘కార్తికేయ 2’ సినిమాలు చేస్తున్నాడు.