Ganesh Immersion: నిమజ్జనానికి తరలిన ఖైరతాబాద్ గణేశుడు

ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్రం ప్రారంభమయింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న పంచముఖ రద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి ఎక్కించారు. ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు చేశారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగతల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ పైకి శోభాయాత్ర సాగనుంది. మొత్తం 2.5 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. […]

Written By: Suresh, Updated On : September 19, 2021 9:12 am
Follow us on

ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్రం ప్రారంభమయింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న పంచముఖ రద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి ఎక్కించారు. ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్ పనులు చేశారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మహా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగతల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ పైకి శోభాయాత్ర సాగనుంది. మొత్తం 2.5 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది.

ట్యాంక్ బండ్ పై 4వ నంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. మహా గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జీహెచ్ ఎంసీ సిబ్బంది భక్తులకు మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య గణనాథుని నిమజ్జనం ముగియనుంది. మరో వైపు బాలాపూర్ గణేశుడి ఊరేగింపు వైభవంగా కొనసాగుతోంది. భజన బృందం పాటలు, డప్పుచప్పుళ్ల సందడి నడుమ కార్యక్రమం ముందుకు సాగుతోంది.

బాలాపూర్ లోని ప్రధాన వీధుల్లో గణనాథుడిని ఊరేగిస్తున్నారు. ఊరేగింపు అనంతరం బాలాపూర్ ముఖ్య కూడలిలో లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. 27 ఏళ్లుగా లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్న ఉత్సవ సమితి యూనివర్సల్ బుక్ ఆప్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఏటా మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్న సుధాకర్ కు ఇందులో చోటు దక్కింది. ఈ భాగ్యనగరం లో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జానాలు జరగనున్నాయి.