Etela Rajender: హుజురాబాద్ లో మారుతున్న రాజకీయ సమీకరణలతో ఈటల రాజేందర్ కు ఓటమి భయం పట్టుకుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ దళితబంధు పథకంతో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. మరోవైపు బీసీ అభ్యర్థి గెలు శ్రీనివాస్ ను నిలిపి వారి ఓట్లను కూడా గంపగుత్తగా తీసుకునేందుకు పావులు కదుపుతోంది. దీంతో ఇక్కడ గెలుపు అంత సునాయాసం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ వ్యూహమేమిటో అని ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పటికే మంత్రులు అక్కడే మకాం వేసి పార్టీని విజయతీరాలకు చేర్చే పనిలో నిమగ్నమయ్యారు.
దీంతో ఈటల రాజేందర్ కు సానుభూతి మార్గం తప్ప ఏదీ కనిపించడం లేదు. దీంతో ఇన్నాళ్లు సానుభూతి పవనాలు వీచినా మెల్లగా అది కూడా దక్కకుండా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎన్నికను వాయిదా వేయించింది కూడా ఇదే ఉద్దేశంతోనే అని తెలుస్తోంది. ఈటల సానుభూతిని తమ వైపు తప్పుకునే క్రమంలో టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీసీ ఓట్లలో కూడా చీలిక వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దళితబంధు పథకం ద్వారా దళితుల ఓట్లు తమకే దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే దళితబంధు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేశారు. దీంతో వారి ఓట్లు మాత్రం ఈటలకు పడే దారి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దళితుల ఖాతాల్లో డబ్బులు పడితే సుమారు ముప్పై ఐదు వేల ఓట్లు టీఆర్ఎస్ కే దక్కనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈటల రాజేందర్ కు కష్టాలు తప్పవని తెలుస్తోంది. మునుపు ఉన్న సానుభూతి మెల్లమెల్లగా తొలగిపోతుందని తెలుస్తోంది.
సామాజిక వర్గాలను సైతం టీఆర్ఎస్ పార్టీ తమ వైపు తిప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో కులాల వారీగా సమావేశాలు నిర్వహించి వారికి కావాల్సిన పనులు చేసి పెడతామని హామీలు ఇస్తున్నారు. దీంతో వారి ఓట్లు సైతం ఈటలకు దక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఈటల రాజేందర్ విజయం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదిఏమైనా ఎట్టిపరిస్థితుల్లో ఇక్కడ విజయం సాధించాలని అధికార పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు.