https://oktelugu.com/

AP MPTC, ZPTC Results: ఏపీ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 515 జడ్పీటీసీ స్థానాలు, 7,220 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం 609 మంది ఎన్నికల అధికారులు,1,047 మంది సహాయ ఎన్నికల అధికారులు నియమించారు. 11,227 మంది పర్యవేక్షలు, 31,133 మంది సహాయ పర్యవేక్షకులు సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు […]

Written By: , Updated On : September 19, 2021 / 08:35 AM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 515 జడ్పీటీసీ స్థానాలు, 7,220 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం 609 మంది ఎన్నికల అధికారులు,1,047 మంది సహాయ ఎన్నికల అధికారులు నియమించారు. 11,227 మంది పర్యవేక్షలు, 31,133 మంది సహాయ పర్యవేక్షకులు సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

జిల్లా మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవిత్యవం మరి కొద్ది గంటల్లో తేలనుంది. అయిదే నెలల క్రితం బ్యాటెట్ పత్రాలను వినియోగించి, నిర్వహించిన ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అర్ధరాత్రి దాటినా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి, విజేతలను ప్రకటిస్తారు.

గుంటూరు జిల్లాల్లో 571 ఎంపీటీసీ, 45 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలు, తూర్పు గోదావరి జిల్లాలో 61 జడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ, ప్రకాశం జిల్లాలో 41 జడ్పీటీసీ, 367 ఎంపీటీసీ, చిత్తూరు జిల్లాలో 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ, కడప జిల్లాలో 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురం జిల్లాలో 781 ఎంపీటీసీ, 62 జడ్పీటీసీ, కర్నూలు జిల్లాలో 37 జడ్పీటీసీ, 495 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నామినేషన్ అనంతరం పోటీలో ఉన్న 81 మంది అభ్యర్థులు మృతి చెందారు.