Ketan Agarwal case : పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు తీవ్రత నేపథ్యంలో పోలీసులు సీన్ రిక్రియేషన్ చేశారు. ఫలితంగా దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఆ విషయాలను చెబుతున్నప్పుడు ఆందోళన వ్యక్తం చేశారంటే.. ఈ ప్లాన్ అమలు చేయడానికి సియా, కేతన్ ఎంత క్రూరానికి తెగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు నిర్వహించిన సీన్ రిక్రియేషన్లో దారుణమైన నిజాలు తెలుగులోకి వచ్చాయి. అవి సభ్య సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ సంఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది అంటే.. ఆ సంఘటన తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
జూన్ 4న కేతన్ అగర్వాల్ ను చంపడానికి అతడికి కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ ప్రణాళిక రూపొందించారు. అయితే ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. దీంతో జూన్ 18న మరోసారి ప్రణాళిక రూపొందించారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం పది గంటల వరకు ఈ వ్యవహారం మీదనే వారిద్దరు చర్చలు సాగించారు.
ఆరోజు ఉదయం 7 గంటల నుంచి వారిద్దరు ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చేతన్ తనను గుర్తుపట్టకుండా ఉండడానికి తన మొబైల్ దాటాను ఆఫ్ చేశాడు. జిపిఎఫ్ ఆప్షన్ కూడా డిస్ యాక్టివేట్ చేశాడు.
ఆరోజు ఉదయం 8 గంటలకు తన షాప్ దగ్గరికి చేరుకున్నాడు. తన ఫోన్ అక్కడే పెట్టి.. ఎటు వెళ్లలేదు అన్నట్టుగా అందరిని నమ్మించాడు. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడాలని.. తన దగ్గర పని చేసే కార్మికుడికి చెప్పాడు.
తన మీద అనుమానం రాకుండా ఉండడానికి తన సంస్థలో పనిచేసే ఉద్యోగి ఫోన్ తీసుకొని.. కోట వద్దకు వెళ్లిపోయాడు. ఒకవేళ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడితే అదే ఫోన్ నుంచి చేశాడు.
ఆ కోట ప్రాంతంలో తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు హుడి ధరించాడు. తన మీద అనుమానం రాకుండా ఉండడానికి కొండమీదికి వెళ్లిపోయాడు.
చేతన్ చెప్పినట్టుగానే కేతన్ అగర్వాల్ ను సియా కొండ ప్రాంతంలోని చివరి అంచు వరకు తీసుకొచ్చింది. అప్పటికి మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలు దాటింది. చేతన్ కు సియా సైగలు చేయడం మొదలుపెట్టింది. అప్పటిదాకా అక్కడ దాక్కుని ఉన్న చేతన్ ఒక్కసారిగా బయటికి వచ్చి కేతన్ ను పైనుంచి కిందికి నెట్టేసాడు.
ఆ తర్వాత వారిద్దరు కిందికి వచ్చారు. సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల తర్వాత తన ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేశాడు.
ఇంటర్నెట్ ఆఫ్ చేస్తే తాను పోలీసులకు దొరకనని కేతన్ భావించాడు. కానీ పోలీసులు అదే ఆధారంతో అతడిని పట్టుకున్నారు. దాదాపు 10 గంటల 40 నిమిషాల పాటు అతడు ఇంటర్నెట్ నిలుపుదల చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ లలో అతడు హుడీ ధరించిన చిత్రాలు దర్శనమిచ్చాయి. అతడి ఫోన్ కు వచ్చిన కాల్స్ వేరే వ్యక్తులు ఎత్తినట్టు పోలీసులు తమ పరిశీలనలో గుర్తించారు. అయితే సీన్ రీ క్రియేషన్ లో పోలీసులు కేవలం సియాను మాత్రమే తీసుకొచ్చారు.
