KCR : అప్పట్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నప్పుడు.. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు కెసిఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఇంతవరకు బయటికి రాలేదు. వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే ఆయన పరిమితమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల రాజకీయ పరిణామాలు జరుగుతున్నప్పటికీ.. కెసిఆర్ పెద్దగా స్పందించడం లేదు. అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు.
ఉన్నట్టుండి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచి బయటికి వచ్చారు. నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి వెళ్లారు. కెసిఆర్ ఏఐజి ఆసుపత్రికి వెళ్లడం పట్ల రకరకాల చర్చలు జరిగాయి. ఆయన ఆరోగ్యం బాగోలేదా.. ఏమైనా పరీక్షల కోసం వచ్చారా.. అనే చర్చలు నడిచాయి. అయితే కెసిఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు. గతంలో ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏఐజి ఆసుపత్రికి వచ్చారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా ఆయన ఏఐజి ఆసుపత్రికి రావడానికి ప్రధాన కారణం మనవడు హిమాంషు.
కేటీఆర్ కుమారుడు హిమాంశు అమెరికాలో చదువుతున్నారు. కొంతకాలంగా హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇటీవల మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగితే తండ్రి తో పాటు అక్కడికి వెళ్లారు. ఆ వేడుకల్లో ఆయన భాగమయ్యారు. హిమాంసు స్పోర్ట్స్ బాగా ఆడతారు. ఇటీవల ఆయన స్పోర్ట్స్ ఆడుతుండగా గాయపడ్డారు. గాయం తీవ్రం కావడంతో వెంటనే ఆయనను ఏఐజి ఆసుపత్రికి తరలించారు. కొద్దిరోజులుగా ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మనవడిని కెసిఆర్ పరామర్శించారు. అతడితో చాలాసేపు మాట్లాడారు. కెసిఆర్ ఏఐజి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ హిమాన్షు ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
కెసిఆర్ రావడంతో ఏఐజి ఆసుపత్రిలో సందడి నెలకొంది. కెసిఆర్ వచ్చారని తెలుసుకొని చాలామంది ఆసుపత్రి చేరుకున్నారు.. కెసిఆర్ ను చూసేందుకు ఉత్సాహం చూపించారు. దాదాపు 45 నిమిషాల పాటు కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు.. ఒకటి లేదా రెండు రోజుల్లో హిమాంశు కు పరీక్షలు చేసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ఏఐజి వర్గాలు తెలిపాయి.
