KCR Interrogation: కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. జస్టిస్ పీసీ ఘోష్ సుమారు 50 నిమిషాలు ఆయనను విచారించారు. ప్రాజెక్టుకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్ ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణానికి మంత్రి వర్గ ఆమోదం ఉందా.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాలను సైతం మార్చడంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నివేదికను కమిషన్ కు కేసీఆర్ అందించారు.