UPI Payments: యూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. త్వరలోనే ఈ లావాదేవీలపైనా ఛార్జీలను ప్రవేశ పెట్టాలని కేంద్రం చూస్తోంది. అధిక డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోంది. వ్యాపారుల వార్షిక ఆదాయం కాకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్ విధించేందుకు చర్చలు జరుగుతున్నాయి. యూపీఐ ద్వారా 3000 కు పైబడిన లావాదేవీలను ఈ ఛార్జీలు విధించే అవకాశం ఉంది.