సినీ కార్మికులకు కన్నడ స్టార్ యశ్ భారీ విరాళం
లాక్ డౌన్ వల్ల ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. బయటకు రంగులమయంగా కనిపించే ఇండస్ట్రీ మీద కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. షూటింగ్ లు జరిగితే కానీ పట్టెడన్నం దొరకని చిన్నాచితకా సినీకార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు రంగం సిద్ధం చేశాడు కన్నడ స్టార్ యశ్. కన్నడ్ చిత్రపరిశ్రమలోని సినీ కార్మికుల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. మూడు వేల మంది కార్మికులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు 1.5 కోట్లు విరాళంగా […]
Written By:
, Updated On : June 1, 2021 / 09:30 PM IST

లాక్ డౌన్ వల్ల ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. బయటకు రంగులమయంగా కనిపించే ఇండస్ట్రీ మీద కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. షూటింగ్ లు జరిగితే కానీ పట్టెడన్నం దొరకని చిన్నాచితకా సినీకార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు రంగం సిద్ధం చేశాడు కన్నడ స్టార్ యశ్. కన్నడ్ చిత్రపరిశ్రమలోని సినీ కార్మికుల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. మూడు వేల మంది కార్మికులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు 1.5 కోట్లు విరాళంగా ఇస్తూ మంచి మనసు చాటుకున్నాడు.