https://oktelugu.com/

కరోనా వైరస్ అమెరికా, చైనా కుట్రేనా?

కరోనా వైరస్ వ్యాపించిన ఏడాది తరువాత గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ ప్రయోగాల వివరాలు బయటకు వస్తున్నాయి. వుహాన్ ల్యాబ్ లోనే ఓ కీలక శాస్ర్తవేత్త వైరస్ కు సంబంధించిన కీలక భాగాన్ని అమెరికా శాస్ర్తవేత్తలకు ఇచ్చి ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు. అప్పట్లోనే కరోనా వైరస్ లాగే ఊపిరితిత్తులను దెబ్బతీసే ఓ వైరస్ ను రూపకల్పన చేశారు. వుహాన్ ల్యాబ్ లో చేసిన ఇలాంటి ప్రయోగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారే వాదనలు బలపడుతున్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 1, 2021 / 09:29 PM IST
    Follow us on

    కరోనా వైరస్ వ్యాపించిన ఏడాది తరువాత గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ ప్రయోగాల వివరాలు బయటకు వస్తున్నాయి. వుహాన్ ల్యాబ్ లోనే ఓ కీలక శాస్ర్తవేత్త వైరస్ కు సంబంధించిన కీలక భాగాన్ని అమెరికా శాస్ర్తవేత్తలకు ఇచ్చి ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు. అప్పట్లోనే కరోనా వైరస్ లాగే ఊపిరితిత్తులను దెబ్బతీసే ఓ వైరస్ ను రూపకల్పన చేశారు. వుహాన్ ల్యాబ్ లో చేసిన ఇలాంటి ప్రయోగాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారే వాదనలు బలపడుతున్న సమయంలో ఈ వివరాలు వెల్లడి కావడం విశేషం.

    అమెరికా, చైనాలు సంయుక్తంగా ప్రమాదకర ప్రయోగాలు నిర్వహించాయి. అమెరికాలో ఆ ప్రయోగాలు ఆపేశాక నిధులు ఇచ్చి చైనాలో కొనసాగించారనే అనుమానాలున్నాయి. 2015లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోనలినా, చైనాలో వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్ర్తవేత్తలు కలిసి ఓ సరికొత్త కరోనా వైరస్ ను సృష్టించారు. ఇది మానవ కణాలకు తేలిగ్గా అతుక్కుంటుంద. ఊపిరితిత్తుల్లో పునరుత్పత్తి అవుతుంది.

    2015లో అమెరికాలో కరోనా వైరస్ పై జరిగిన ప్రయోగంలో కీలకమైన ఎస్ హెచ్ సీ014-కోవిడ్ స్పైక్ ప్రొటిన్ ను షి జియాంగ్ లీ సరఫరా చేశారు. ఆమె అప్పటికే వుహాన్ ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తున్నారు. దీన్ని చైనీస్ హార్స్ హు గబ్బిలాల్లోని వైరస్ ల నుంచి సేకరించారు. దీన్ని సార్స్ లాంటి వైరస్ ను అమర్చారు. దీంతో ఇది ఎలుకలకు సోకే లక్షణాన్ని సంతరించుకుంది. ఈ ఎలుకలకు సార్స్ పై పనిచేసే రోగనిరోధక చికిత్సను అందించినా ప్రయోజనం కలగలేదు. వ్యాక్సిన్లు కూడా పనిచేయలేదు. ఇదే స్పైక్ ప్రొటిన్ మనుషుల్లోని ఏన్2 ఎంజైమ్ కు అతుక్కుంటుంది. దీని ద్వారా మానవుల్లోకి కూడా ప్రవేశిస్తుంది.

    కరో నా వైరస్ వ్యాపించిన సమయంలో ఈ పరిశోధనపై పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. వైరస్ లక్షణాలు 2015లో తయారు చేసిన వైరస్ లక్షణాలతో పోలి ఉండడం, వుహాన్ ఇన్ స్టి ట్యూట్ లో కరోనాపై ప్రయోగాలు జరుగుతుండడం, వుహాన్ లోనే వైరస్ తొలి కేసు రావడంతో అనుమానాలు పెరిగాయి. దీంతో 2020 లో అమె రికా 2015 వైరస్ జన్యుక్రమాన్ని సార్స్ కోవ్ 2 జన్యుక్రమాన్ని బహిర్గతం ేసింది. గబ్బిలాల నుంచి వైరస్ అతిథ్య జీవిలోకి చేరి అక్కడి నుంచి మనిషిలోకి వచ్చిందని శాస్ర్తవేత్తలు ఆధారాలతో నిరూపించలేకపో యారు. ఆతిథ్య జీవి ఏదో ఇప్పటికీ తెలియలేదు. వుహాన్ నగరం సమీపంలో భారీ సంఖ్యలో గబ్బిలాలు లేవు.