జూడాలు తక్షణమే విధుల్లో చేరాలి.. సీఎం కేసీఆర్
కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ జూనియర్ డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పై ఏనాడు వివక్ష చూపలేదని వారి సమస్యలను పరిష్కరిస్తునే ఉన్నాదని ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్ఫష్టం చేశారు. బుధవారం ప్రగతి భవన్ లో వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాల […]
Written By:
, Updated On : May 26, 2021 / 05:14 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ జూనియర్ డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పై ఏనాడు వివక్ష చూపలేదని వారి సమస్యలను పరిష్కరిస్తునే ఉన్నాదని ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్ఫష్టం చేశారు. బుధవారం ప్రగతి భవన్ లో వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాల మీద ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.