https://oktelugu.com/

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయా.. అనేక వ్యాధులకు చెక్..?

మొక్కల వల్ల మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభిస్తుందనే సంగతి తెలిసిందే. మనుషుల చుట్టూ గాలిని శుభ్రం చేయడం కొరకు అవసరమైన ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలలో కొన్ని మొక్కలను ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉండే ఆర్కిడ్ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఎంతో మంచిది. రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 26, 2021 / 05:25 PM IST
    Follow us on

    మొక్కల వల్ల మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభిస్తుందనే సంగతి తెలిసిందే. మనుషుల చుట్టూ గాలిని శుభ్రం చేయడం కొరకు అవసరమైన ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలలో కొన్ని మొక్కలను ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉండే ఆర్కిడ్ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఎంతో మంచిది.

    రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేసే ఈ మొక్క పెయింట్స్‌లో ఉండే జిలీన్ కాలుష్యాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఎవరైతే వాళ్ల ఇంట్లో ఈ మొక్కలను పెంచుకుంటారో వారు స్వచ్చమైన గాలిని పొందే అవకాశం ఉంటుంది. ఇంట్లో కలబంద మొక్కలను పెంచుకుంటే ఎంతో మంచిదని చెప్పవచ్చు. మనం నిత్యం ఉపయోగించే ఔషధాలతో పాటు కాస్మోటిక్స్ ను కలబందతో తయారు చేస్తారు.

    రాత్రి సమయంలో ఆక్సిజన్ ను రిలీజ్ చేసే ఈ మొక్క గాలి నాణ్యతను మెరుగుపరచడంతో ఎంతగానో సహాయపడుతుంది. కలబంద మాదిరిగా ఉండే స్నేక్ ట్రీ గాలిలో ఉండే కార్బన్ డై యాక్సైడ్ ను లాగేసుకోవడంతో పాటు రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఎవరైతే ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటారో వాళ్లకు శుద్ధమైన ఆక్సిజన్ లభిస్తుంది. పీపాల్ చెట్టును ఇంట్లో పెంచుకుంటే డయాబెటిస్, ఉబ్బసం లాంటి సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

    రాత్రి సమయంలో గాలిని శుద్ధి చేసే చెట్లలో వేప చెట్లు ఒకటి. వేప చెట్లలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.