JEE Advanced Result: జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదలయ్యాయి. అనుకున్న సమయం కన్నా ముందుగానే కాన్పూర్ ఐఐటీ రిజల్ట్స్ ప్రకటించింది. రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ఏడాది 6 విడతల్లో సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఫస్ట్ ఫేజ్ లో జూన్ 11 వరకు ఆఫ్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఫలితాలు jeeadv.ac.in డాట్ కాంలో తెలుసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా దాదాపు 1.80 లక్షల మంది పరీక్ష జేఈఈ అడ్వాన్స్ డ్ రాసినట్లు సమాచారం. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనా. గతేడాది అడ్వాన్స్ డ్ లో రిజర్వేషన్ల ప్రకారం మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.