
పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ వి అనాలోచిత నిర్ణయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. దీని వల్ల అధికారులు బలవుతున్నారని చెప్పారు. పోలవరం సహాయ, పునారావాస కార్యక్రమాలను పూర్తి చేయకుండానే గిరిజనులను బలవంతంగా తరలిస్తున్న ప్రక్రియను జాతీయ ఎస్టీ కమిషన్ నిలదీసింది. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల జూన్ నుంచి ముంపు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.