
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్ పై లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్న జగన్ అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. జగన్, రఘురామ, సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించిన సీబీఐ న్యాయస్థానం విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది.