టాలీవుడ్ లో గత కొన్ని రోజుల నుండి లోకల్, నాన్ లోకల్ లాంటి పదాలు తెగ చర్చలోకి వస్తున్నాయి. వీటన్నిటి పై మాజీ హీరో సుమన్ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు. భారతదేశంలో పుట్టిన పౌరులందరూ లోకలేనని సుమన్ చెప్పుకొచ్చాడు. ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం కాబట్టి దీన్ని పురస్కరించుకుని అస్టర్‌ప్రైమ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సుమన్.
ఈ కార్యక్రమంలో వైద్యుల గొప్పతనం గురించి మాట్లాడిన సుమన్, పనిలో పనిగా పరోక్షంగా ‘మా’ ఎన్నికల వ్యవహారం గురించి ముచ్చటించారు. ఈ దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకల్ గానే మనం ఫీల్ అవ్వాలి. దేశం అభివృద్ధి జరగాలి అంటే అందరూ కలిసి కట్టుగా ఉండాలి. కలిసి కట్టుగా ఉండాలి అంటే ఈ లోకల్- నాన్ లోకల్ లాంటి వాటిని పర్సనల్ గా తీసుకోవడం అనవసరం అంటూ సుమన్ ఆగ్రహించారు.
నేటి జనరేషన్ లో కూడా ఇలాంటి వ్యవహారాలను పట్టుకు కూర్చోవడం, వీటిని ప్రస్తావించడం పూర్తి అర్థరహితం. నిజంగా ఈ లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ను వైద్యులు, రైతులు కూడా పర్సనల్ గా ఫీల్ అయి ఫాలో అయితే, ప్రజలకు చికిత్స, ఆహారం అందదు అంటూ సుమన్ మాట్లాడాడు. అయితే సుమన్ మాటలను బట్టి, తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ కే సుమన్ మద్దతు అని అర్ధమవుతుంది.
ఏది ఏమైనా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉన్నా రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతూ ఉండటం, అలాగే లోకల్ – నాన్ లోకల్ అనే వాదాన్ని తీసుకురావడంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు కూడా రాజకీయ ఎన్నికల్లా మారిపోయాయి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Maa elections suman indirectly supports prakash raj
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com